ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాకతీయ చరిత్ర , వారసత్వ సంపదతో పాటుగా , ఆధునీకత ఉట్టిపడేలా వరంగల్ రైల్వేస్టేషన్ ను తీర్చిదిద్దుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రా బాద్ డివిజనల్ మేనేజర్ అమిత్ వరధాన్ చెప్పారు, వరంగల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పురోగతిని DRM తనిఖీచేశారు . అనంతరం రైల్వే స్టేషన్ మేనేజర్ చాంబర్ లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వరంగల్ రైల్వే స్టేషన్ ను కాకతీయ వారసత్వం ఉట్టిపడేలా రూపుదిద్దుతున్నట్లు చెప్పారు . శివనగర్ వైపు ప్రవేశమార్గాలు , ప్రయాణీకుల విశ్రాంతి మందిరాలు , విస్తారమైన బుకింగ్ కౌంటర్ , అధునాతన పే అండ్ యూజ్ టాయిలెట్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు .

అలాగే 3 , 4 ఫ్లాట్ ఫారాలకు అనుసంధానంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందన్నారు . అలాగే ఈ వైపు ట్రయిన్ , కోచ్ ఇండికేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు . వీటికి తోడు గార్డెన్ ను ఏర్పాటుచేస్తున్నామన్నారు . భవనాల లోపలి వైపు గోడలకు చేర్యాల పెయింటింగ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు . రూ . 13 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించేందుకు తనిఖీలు చేస్తున్నట్లు డీఆర్ఎం చెప్పారు . ప్రస్తుతం ఎస్కలేటర్ వద్ద పుట్ ఓవర్ బ్రిడ్జిని విస్తరించనున్నట్లు చెప్పారు . నాగవెళ్లి , ఎల్టీటీ రైళ్లను వరంగల్లో నిలిపే విషయాన్ని రైల్వేబోర్డు చైర్మన్ దృష్టికి తీసుకుపోనున్నట్లు డీ ఆర్ ఎం చెప్పారు…