పార్లమెంటు ఎన్నికలు వస్తున్న తరుణంలో నేతలు పార్టీలు మారేందుకు ఇదే అనువైన సమయం అని భావించి టీఆర్‌ఎస్ గూటికి చేరేందుకు సిద్దం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్‌తో తన కూమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి భేటి అయినట్లు తెలుస్తుంది.

మంత్రి పదవి:

పార్లమెంటు ఎన్నికల తర్వాత సబితా ఇంద్రారెడ్డికి మంత్రిగా అవకాశం ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఊహించిని పరిణామంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలినట్లు అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 16సీట్లు గెలవాలనే కసితో ఉన్న టీఆర్‌ఎస్ ఈ మేరకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.