మహారాష్ట్రలోని నిలంగా ప్రాంతంలో దారుణం జరిగింది. ఒక మహిళ తన భర్తతో కలిసి వ్యవసాయంలో ఒక ఇంటిని నిర్మించుకుని దానిలో ఉంటున్నారు. కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో విసిగిపోయిన భర్త భార్యను ఆమె పుట్టింటికి వెళ్లి వదిలేసివచ్చాడు. ఈ క్రమంలో కొద్ది రోజులకు భార్య తల్లి వచ్చి వారిని ఓదార్చి ఆమెను ఇక్కడే దిగబెట్టి వెళ్లారు. అప్పుడు వారి మధ్య మరల గొడవలు సంభవించాయి. దీంతో అతను కోపంతో విచక్షణను కోల్పోయాడు. వెంటనే తన భార్యను గదిలో బంధించి, తన పొలం యజమాని, అతని సోదరుడితో కలిసి అఘాయిత్యం చేయించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.