కాజీపేటకు చెందిన రైల్వే ఉద్యోగి టి. మాదవి. మాదవి గత కొన్ని సంవత్సరాల క్రితం కారుణ్య నియామకంలో 2008లో ఆమె తండ్రి జాబ్‌లో రైల్వేలో చేరింది. కాజీపేట రైల్వే స్కూల్‌లో ఉన్నతవిధ్య పూర్తి చేసి హన్మకొండలో డిగ్రీ పూర్తి చేసింది. మాధవి మెదటగా ఉద్యోగంలో చేరినప్పుడు కాజీపేటలో పాయింట్స్‌ మెన్‌గా (బోగీలను విడదీయడం, తగిలించడం) విధుల్లో చేరిన మాధవి తర్వాత క్రమంలో రైలుగార్డ్‌ లో శిక్షణ తీసుకుంది. ఇందులో భాగంలో మెదటిసారిగా బుధవారం ఉదయం కాజీపేట రైల్వే స్టేషన్‌లో గూడ్స్‌రైలుకు గార్డుగా విదుల్లో చేరింది. చేతిలో పచ్చాజెండా పట్టుకుని రైలుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే రైలు కదిలింది. కాజీపేట జంక్షన్‌ – సనత్‌నగర్‌ మధ్య నడిచే యూటీసిఎం గూడ్స్‌ రైలుకు గార్డు డ్యూటీచేస్తూ సనత్‌నగర్‌కు చేరుకుంది. దక్షిణ మధ్య రైల్వేలోనే మెదటి మహిళ గార్డుగా విదులు నిర్వర్తించిన మాధవిని కాజీపేట ఏరియా మేనేజర్‌ పూర్ణచందర్‌తో పాటు పలువురు రైల్వే ఉన్నతాధికారులు ప్రశంచించారు.