దక్షిణకాశిగా ప్రఖ్యాతిగాంచిన నాటి మణిగిరి నేటి మెట్టుగుట్ట దేవాలయం. శివకేశవులు ఒకే స్థలంలో కొలువుదీరిన పుణ్యక్షేత్రం శ్రీ మెట్టు రామలింగేశ్వరస్వామి దేవస్థానం. క్రీస్తుశకం 950లో వెంగి దేశ చాళుక్యరాజులు పరిపాలన అనంతరం మణిగిరి ప్రాంతం కాకతీయ రాజులు చేజిక్కించుకున్నారని, కొరివి శాసనాల ద్వారా చరిత్ర తెలుపుతుంది. కాకతీయుల కాలంలో మెట్టుగుట్ట ప్రాంతాన్ని మణిగిరిగా పిలిచేవారు.
కాజీపేట రైల్వే స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరం లో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ ప్రధాన రహదారికి ఆనుకుని మడికొండ గ్రామంలో పెద్ద గుట్టపైన మెట్టుగుట్ట దేవాలయం కాకతీయ రాజులు నిర్మించారు. మణిగిరిగా పిలవబడే ఈ పుణ్యక్షేత్రం రానురానూ మెట్టుగుట్టగా ప్రాచుర్యం పొందింది.

రామలింగేశ్వర స్వామి దేవాలయం చాల పురాతనమైనది మరియ ఎంతో విసిస్టత గల దేవాలయం ఇది ! తెలుగు నేల కొన్ని శతాబ్దాల చరిత్ర గల దేవాలయాలకు నిలయం . శివకేశవుల మధ్య అభేద్యాన్ని చాటిచెప్పినపుణ్యక్షేత్రం మెట్టుగుట్ట. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదురెదురుగా ఉంటాయి.


మెట్టుగుట్టపై నవగుండాల ప్రత్యేకత
చారిత్మాతక చరిత్ర గల ఓరుగల్లు చరి త్రలో మెట్టుగుట్ట ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. మెట్టుగుట్టపై సీతారామచంద్రస్వామి, శివాలయంలతో పాటు నవ గుండాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. నవగుండాల్లో పాలగుండం, జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, బ్రహ్మగుండం, రామగుండం, గిన్నెగుండాలు ప్రసిద్ధిమైనవి. వీటిలో పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాప వినాశనిగా భక్తులు కొలుస్తారు. వీటికి పాతాల ఊట కలదనేది అంటుంటారు. జీడి గుండం(వరసిద్ధి) గుండం సంతానార్జులైన స్త్రీలు వరసిద్ధి పొందుతారనే నమ్మకం భక్తుల్లో ఉంది. నవగుండాల్లో పాలగుండం నుంచి కాశికి అనుసంధానం ఉందనేది చరిత్ర, భక్తులు చెబుతుంటారు. వీటితో పాటు భీముని పాదముద్రలు జీడిగుండం పక్కనే దర్శనమిస్తాయి.

మెట్టుగుట్టపై సీతారామచంద్రస్వామి, శివాలయంలతో పాటు నవ గుండాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. నవగుండాల్లో పాలగుండం, జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, బ్రహ్మగుండం, రామగుండం, గిన్నెగుండాలు ప్రసిద్ధిమైనవి. వీటిలో పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాప వినాశనిగా భక్తులు కొలుస్తారు. వీటికి పాతాల ఊట కలదనేది అంటుంటారు. జీడి గుండం(వరసిద్ధి) గుండం సంతానార్జులైన స్త్రీలు వరసిద్ధి పొందుతారనే నమ్మకం భక్తుల్లో ఉంది. నవగుండాల్లో పాలగుండం నుంచి కాశికి అనుసంధానం ఉందనేది చరిత్ర, భక్తులు చెబుతుంటారు. వీటితో పాటు భీముని పాదముద్రలు జీడిగుండం పక్కనే దర్శనమిస్తాయి.

శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన తహసీల్దార్

చరిత్రాత్మక మెట్టు రామ లింగేశ్వరాలయంలో శివరాత్రి ఏర్పాట్లను శనివారం కాజీపేట మండల తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావు పరిశీలించారు . శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు . కార్యక్రమంలో వీఆర్వో సుఖేందర్ రెడ్డి , ఆలయ చైర్మన్ అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .