33 వేల కోట్ల దేవతలు కొలువై ఉన్న ఈ పవిత్ర భూమి లో ప్రతి గంటకు నలుగురు దళిత మహిళలు అత్యాచారానికి గురి కాబడుతున్నారు.
— ప్రతి వారానికి 10 నుంచి 14 మంది దళితులు హత్యకు గురి కాబడుతున్నారు అని జాతీయ మానవ హక్కుల(NHRC) కమిషన్ తన నివేదికలో తెలిపింది.
ఇలాంటి అమానవీయ సంఘటనలను పూర్తి ఆధారాలతో సహా ఎన్నో పోస్ట్లుచేసిన. వాటిని చూసిన తర్వాత కూడా.. దళితులపై దాడులు ఎక్కడ జరుగుతున్నాయి,
ఈ కాలంలో కుల వివక్ష ఎక్కడ ఉంది,
అని వాదించే కుల ఉగ్రవాదులను చూస్తే నాకు నవ్వాలా ఏడవాలా అర్థం అయిత లేదు…
ఈ దారుణాన్ని ఒకసారి చూడండి.
రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో దారుణం చోటు చేసుకుంది. గత నెల 26న భర్త కళ్ళ ముందే భార్యను రేప్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెలితే ఆళ్వార్‌లోని లాల్‌వాడీ గ్రామం నుంచి త్రల్విక్షా గ్రామానికి ఓ దళిత జంట బైక్‌పై బయలుదేరింది. వీరిని రెండు బైక్‌లపై వెంబడించిన కొందరు దుండగులు నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే వీరి బైక్‌ను అడ్డగించారు. తరువాత భర్తను విచక్షణారహితంగా కొట్టారు. ఓక వైపు భర్తపై ఇద్దరు దుండగులు దాడిచేస్తుండగా, మరో ముగ్గురు వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తరువాత మిగిలిన ఇద్దరు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దుర్మార్గాన్ని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. అత్యాచార విషయం బయటకు చెబితే చంపేస్తామనీ, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గుర్తుతెలియని నిందితులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు పలు పెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.