పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా పాక్ లోకి చొచ్చుకెళ్ళి మరీ బాలాకోట్లో భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పాక్ ప్రభుత్వంతో పాటు అక్కడ తలదాచుకుంటున్న అంతర్జాతీయ నేరగాళ్ళలో కూడా భయం పుట్టించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి . భారత సంతతికి చెందిన దావుద్ ఇబ్రహీం దీర్ఘకాలంగా పాక్ సంరక్షణలో ఉన్నాడు . కొంతకాలం పాకిస్థాన్ , ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని గ్రామాల్లో పాక్ అతనికి ఆశ్రయం కల్పించింది ఇప్పుడు కరాచీలోని అత్యంత జనసమర్ధమైన ప్రాంతంలోనే విలాసవంతమైన భవనంలో పాక్ అంతర్గత నిఘా వర్గాల భద్రత నడుమ దావుద్ ఇబ్రహీం కుటుంబం సురక్షితంగా జీవిస్తోంది . 1993 మార్చి 12 ముంబైలో వరుస బాంబుదాడుల పథకరచయిత దావుదేనని నిఘా వర్గాలు గుర్తించాయి . అతని నేతృత్వంలోనే ముంబై నగరంలో వందల మందిని పొట్టనపెట్టుకున్న బాంబుదాడులు సాగాయి . ఇందుకోసం బాంబుల సమీకరణ నుంచి వ్యూహాల అమలు వరకు అన్నింటికి దావుదే బాధ్యుడని తేలింది .

Advertisement

భారత్ తో పాటు అమెరికా కూడా దావుద్ ని అంతర్జాతీయ నేరస్తుడిగా ప్రకటించింది, ఇప్పటికీ భారత్ ప్రకటించిన అత్యంత ప్రమాదకర నేరస్తుల జాబితాలో దావుద్ పేరు ముందుంది . అలాంటి దావూద్ కు ఇప్పుడు షాక్ సురక్షితమైన ఆశ్రయం కల్పిస్తోంది . ఈ మాఫియా డాన్ ఇన్నాళ్ళు పాక్ కేంద్రంగానే దుబాయ్ నుంచి ముంబై వరకు తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించి నిర్వహిస్తున్నాడు . నిత్యం హత్యలు , దోపిడీలు , స్మగ్లింగ్ , కిడ్నాప్లు బ్లాక్ మెయిలింగ్ వంటి పలు నేరాలను తన అధీనంలోని ‘ డి ‘ కంపెనీ సభ్యుల ద్వారా నిర్వహిస్తున్నాడు . ఇంతకాలం సురక్షితంగా , ఆనందంగా ఉన్న దావూద్ కు ఇప్పుడు భారత్ అంటే వెన్నులో భయం పుట్టుకొస్తున్నట్లు ” నిఘావర్గాలు గుర్తించాయి . ఏదో రోజున అబోటాబాద్ లోకి అమెరికన్ నావికాదళానికి చెందిన షీల్స్ చొచ్చుకెళ్ళి బిన్ లాడెన్ ను పట్టుకుని మట్టుబెట్టినట్లు కరాచీలోని దావుద్ నివాసంపైకి భారత వాయుసేనలు సర్జికల్ దాడులు నిర్వహించి అతన్ని బాంబుల వర్షం కురిపిస్తాయన్న భయం దావూద్ బృందంలో నెలకొన్నట్లు తాజా నివేదికల ద్వారా తెలిసింది . దీంతో పాక్ ఐఎస్ఐ కూడా అప్రమత్తమైంది . దావూద్ ను మరింత సురక్షితమైన స్థానానికి మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించారు .

ముంబైలో వరుస పేలుళ్ళ అనంతరం భారత్ నుంచి తప్పించుకుపోయాడు . దుబాయ్ కి వెళ్ళాడు . కొంతకాలం తర్వాత పాకిస్థాన్ చేరుకున్నాడు . అక్కడి నుంచే . అంతర్జాతీయ స్థాయిలో తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు . పాక్ జాతీయులతోనే తన పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు . పాకిస్థాన్ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారుడు జునైద్ తో దావుద్ తన కుమార్తె మహంకు పెళ్ళి జరిపాడు . మరో కుమార్తె మెహరీన్ ను పాకిస్థాన్ అమెరికన్ ఆయూబీకిచ్చి పెళ్ళి చేశాడు . అతని కుమారుడు మొయిన్ లండన్లో స్థిరపడ్డ పాకిస్థానీ వ్యాపారవేత్త కుమార్తె సానియాను వివాహమాడాడు . పాకిస్థాన్ దావుదిను రాచమర్యాదలతో ప్రత్యేక అతిథిగా గౌరవిస్తోంది . ఇంత వరకు ఐఎస్ఐ సంరక్షణలో తన ప్రాణం , వ్యాపారం సురక్షితమన్న భరోసా దావుదికుండేది . కానీ ఇప్పుడు ఆ పాకిస్థాన్ తనను సంరక్షించలేదన్న భయం దావూద్లో ఏర్పడినట్లు తెలుస్తోంది .