దాస్యం కు మద్దతుగా స్వచ్చందంగా 5000 మంది యువకుల భారి ర్యాలీ
ఆదివారం నాడు పశ్చిమ TRS అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ కు మద్దతుగా హన్మకొండ ఏకశిలా పార్క్ నుండి అమరవీరుల స్థూపం వరకు 5000 మంది యువకులు, విద్యార్థులు అధ్వర్యంలో భారి ర్యాలీ నిర్వహించారు .
ఈ ర్యాలీ ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ తెలంగాణను దోచుకోవడానికి మల్లొకసారి మహాకూటమి పేరుతో దొంగలందరూ ఒకటయ్యారని అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ప్రజల మధ్య ఉంటారని ఆయన ప్రజల మనిషి అని ఆశతో ఉన్న వారికి అధికారం ఇస్తే అవినీతికి పాల్పడతారని ఆశయం ఉన్నవారికి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తారని వినయ్ భాస్కర్ ఆశయం గల వ్యక్తిని ఆయనను బలపరిచి కారు గుర్తుకు ఓటు వేసి భారి మెజార్టీతొ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి కార్పరేటర్ దాస్యం విజయ్ భాస్కర్, దివంగత మాజీమంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు దాస్యం అభినవ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.