భారతదేశ శిల్ప చరిత్రలోలోనే విజమైన నిర్మాణం , శిల్పకళా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే దేవునిగుట్ట ఆలయం ఓ అద్భుతమని ఇంగ్లంకు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ ఆడమ్ హార్డీ అన్నారు . మంగళ – బుధవారాల్లో వరంగల్ జిల్లా పరిధిలోని చారిత్రక ప్రదేశాల్లో ఆయన పర్యటించారు .

ఈ సందర్భంగా జయశంకర్ భూ పాలపల్లి జిల్లాలోని ములుగు మండలంకారూరు గుట్టపై లక్ష్మీనర్సింహ ఆలయా ( దేవునిగుట్ట న్ని సం దర్శించారు . దక్షిణాసియాలోని హిందూ , జైన , బుద్ద ఆలయ నిర్మాణ రీతులపై అపార పరిజ్ఞానం ఉన్న ఆడమ్ ప్రస్తుతం దక్షిణ ఆసియాలోని ఆలయాల నిర్మాణ పద్దతుల గురించి పరిశోధనలను జరిపే ప్రసాదా అనే సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు దేవుని గుట్టను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లా డుతూ భారతదేశంలో సాటిలేని నిర్మాణం , అత్యద్భుత కట్టడం దేవునిగుట్ట అని . ఇలాంటి ఆలయం భారతదేశంలో మరెక్కడా లేదన్నారు . దేవునిగుట్ట శిల్పాలు , నిర్మాణ శైలిని పరిశీలించి . 6లేదా 7 శతాబ్దానికి చెందిన కట్టడుగా భావిస్తున్నట్లు చెప్పారు .

ముక్కలు ముక్కలుగా శిల్పాలను చెక్కి వాటిని ఒకదానిపై ఒకటిగా కూర్చుతూ అరుదైన పద్దతిలో ఆలయం నిర్మించినట్లు చెప్పారు శిథిల స్థితిలో ఉన్న ఈ ఆలయం బలహీనంగా ఉందని , దీనిని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరముంద న్నారు . ఈ ఆలయాన్ని కేంద్ర పురావస్తు తన పరి ధిలోకి తీసుకుని పునరుద్దరణ చేయాలని కోరారు భవిష్యత్తులో మరింత సమగ్రంగా పరిశోధన చేస్తా మని తెలిపారు . వరంగల్ కు చెందిన చరిత్ర పరిశో ధకుడు , టూరిజం కన్సలైటి అరవింద్ ఆర్య దేవ నిగుట్ట గురించి ఫేసబుక్ లో పోస్ట్ చేయగా దానిని చూసి ప్రత్యక్షంగా చూసేందుకు ఇంగ్లండ్ నుంచి వరంగల్ వచ్చారు .