దైవ దర్శనానికి వెళ్తుండగా మార్గ మద్యలో ఆటోను ఇసుక ట్రాక్టర్‌ ఢీ కొట్టడంతో  ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన నెల్లికుదురు మండలంలోని నర్సింహులగూడెం గ్రామ బస్టాండ్‌ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ముల్కలపల్లి మండలం పూసగూడెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఎండీ నజీరుద్దీన్, రజీయా, ఖాసీప్‌ఖాన్, రహాన్‌ఖాన్, నస్రిమ్, హహ్రజ్‌లు రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌కు తమ సొంత ఆటోలో బయలు దేరారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం గ్రామ బస్టాండ్‌ సమీపం వద్దకు రాగానే సింగారం గ్రామం భాస్కర్‌కు చెందిన ట్రాక్టర్‌ నర్సింహులగూడెం గ్రామం నుంచి ఇసుక లోడుతో అతి వేగంతో వచ్చి నెల్లికుదురు వైపు వెల్తున్న ఆటోను ఢీకొట్టింది.

దీంతో ఆటోలో ప్రయాణికులతో ప్రధానరహదారి పక్కనే ఉన్న కల్వర్టుపై నుంచి ఎగిరి పడింది ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలు కాగా ఎండీ రజీయా, నజీరుద్దీన్‌కు తీవ్రగాయాలయ్యాయి.