నగరంలో దారుణం! ఇంటి ఓనర్ కూతురిపైనే అత్యాచారాం..

నగరంలో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని ఇంటి ఓనర్ కూతురినే బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రహమత్‌నగర్‌లో ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సొంతింటిలో నివసిస్తోంది. ఆమె కుమార్తెకు మతిస్థిమితం సరిగ్గా ఉండకపోవడంతో కంటికిరెప్పలా కాపాడుకుంటోంది. వీరింట్లోకి ఉమ్మడి వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకి చెందిన పల్లకొండ వీరస్వామి(38) మూడు నెలల నుండి అద్దెకు ఉంటున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నప్పటికీ విబేధాల కారణంగా దూరంగా ఉంటున్నాడు. ఓ పరిశ్రమంలో కార్మికుడిగా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి యజమానురాలి కుమార్తెపై అతడి కన్ను పడింది.

రాఖీ పౌర్ణమి రోజున ఇంటి యజమానురాలు తన సోదరుడికి రాఖీ కట్టేందుకు కుమార్తెను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన వీరాస్వామి ఇంట్లోకి వెళ్లి మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. సాయంత్రం వేళ ఇంటికి వచ్చిన తల్లి కుమార్తె ఏదో ఇబ్బంది పడుతున్నట్లు గమనించి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె స్థానికులతో కలిసి వీరాస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరాస్వామి కోసం గాలింపు చేపట్టి 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here