ప్రేమ పేరుతో దళిత యువతిని రఫిక్ అనే అనే యువకుడు మోసం… ! రఫిక్ ఆ యువతిని బలవంతంగా మతం మార్చి పెళ్ళి చేసుకుని గర్భం దాల్చిన తర్వాత మోసం చేసాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాలు: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్‌లో సంఘటన చోటుచేసుకుంది. క్రిష్ణవేణి అలియాస్ షభానా, రఫీక్ మల్కాజిగిరి మల్లికార్జున్ నగర్‌లో నివాసముండేవారు. రఫిక్ వరంగల్‌కి చెందిన వ్యక్తి కాగా, ఆరేళ్ల క్రితం ప్రేమించి హైదరాబాద్‌కు వచ్చారు. మలక్‌పేట్‌లో ఉద్యోగం చేస్తూ పెళ్ళిచేసుకున్నారు. అమ్మాయి హిందువు కావడంతో మతం మారితే కానీ పెళ్ళి చేసుకోనని రఫిక్ తెలపడంతో, బలవంతం చేయడంతో తప్పన్ని పరిస్థితుల్లో మతం మార్చుకుని ‘షభానా’ గా మారింది.

పెళ్లైనా తరువాత కొన్ని రోజులు కాపురం బాగానే సాగింది. కానీ కొద్ది రోజుల తరువాత అసలైన కథ మొదలైంది. పిల్లలు కావాలని రఫిక్ షబానాను బలవంతం చేయడం మొదలుపెట్టాడు. అనారోగ్యం వల్ల షబానాకు నాలుగు సార్లు అబార్షన్ అయింది. అవేమీ పట్టించుకోని రఫిక్‌ అప్పటి నుంచి భార్యని వేధించడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని హిం‍సించడం ప్రారంభించాడు.

దీనిపై షబానా పలుమార్లు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కౌన్సిలింగ్ తో సరిపెట్టారు. ఆఖరికి తాజాగా షబానా గర్భందాల్చారు. అయితే రఫిక్‌ షబానాకు నాలుగో నెల రాగానే తనకు సంబంధం లేదని వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుతో డఇలాంటి నీచపు పనులకు దిగజారే వాడిని కఠినంగా శిక్షించాలని భాదితురాలు క్రిష్ణవేణి(షబానా) డిమాండ్ చేస్తున్నారు…