దక్షిణాది హీరోయిన్లు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ తరం నటీమణులు అనుష్క , నయనతార , త్రిష , జ్యోతికలు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించడానికి మక్కువ చూపుతున్నారు. ఇదే వరసలో తానూ సిద్దమేనంటోంది బిందుమాధవి . వరుస విజయాలతో కోలీవుడ్ లో నటిగా రాణిస్తున్న ఆమె బిగ్ బాస్ – 1 గేమ్ షోలో కూడా పాల్గొని అభిమానులను సంపాదించుకుంది . ప్రస్తుతం బిందుమాధవి కృష్ణ హీరోగా నటించిన ‘ కళుగు – 2 ‘ లో హీరోయిన్ గా నటించింది . ఈ చిత్రం ఆగస్టు 2వ తేదీన విడుదల కానుంది . ఈ నేపథ్యంలో కథకు ప్రాముఖ్యత వుంటే అమలాపాల్లా తాను నటించేందుకు సిద్ధంగా వున్నానని చెప్పుకొచ్చింది . కథకు ప్రాముఖ్యత వుంటే నగ్నంగా నటించేందుకు తాను సిద్దమంటోంది బిందుమాధవి . ఇటీవలే అమలాపాల్ కూడా ” ఆడై ” చిత్రంలో నగ్నంగా నటించి విమర్శలతో పాటు పలువురి ప్రశంసలు అందుకుంటోంది . ఇప్పుడు బిందు మాధవి కూడా నగ్నంగా నటించడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పుకొస్తుంది..