నటుడు విజయకుమార్ ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ఆయన కుమార్తె, నటి వనితను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు, అష్టలక్ష్మినగర్‌లో విజయకుమార్‌కి సొంతమైన బంగ్లా ఉంది. దీనిని ఆయన కుమార్తె వనిత గతంలో షూటింగ్ నిమిత్తం అద్దెకి తీసుకొని ఖాళీ చేయలేదు. విజయకుమార్ ఫిర్యాదుతో పోలీసులు ఆమెను ఇంటి నుంచి పంపించారు. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంట్లోకి వెళ్లడానికి కోర్టు అనుమతినిచ్చినట్లు పేర్కొంటూ వనిత తన న్యాయవాదులతో కలిసి గురువారం బంగ్లాలోనికి వెళ్లారు. విజయకుమార్ మళ్లీ మదురవాయల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శుక్రవారం వనితను బయటకు పంపి, బంగ్లాకు తాళాలు వేశారు. తర్వాత ఆమెపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. తర్వాత జామీనుపై వదిలిపెట్టారు.
ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తగిన చర్య తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి వనిత ఫిర్యాదు చేశారు.