నర్సంపేట సీటు పై మహాకూటమి లొ కొట్లాట

? నర్సంపేట సీటు కొసం పట్టుబడుతున్న దొంతి, రేవూరి, ఇద్దరి మధ్య కుదరని సయోధ్య
? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క నర్సంపేట ను మాత్రమే అడుగుతున్న తెలుగుదేశం
? అవసరమైతే మరొసారి ఇండిపెండెంట్ గా నైనా పొటిచేస్తాను తప్ప నియోజకవర్గం మారేది లేదు అంటున్న దోంతి మాధవరెడ్డి
? పరకాల, పశ్చిమ రెండింటిని వద్దన్న రేవూరి ప్రకాష్ రెడ్డి

నర్సంపేట నియోజకవర్గం చుట్టే మహాకూటమి రాజకీయాలు అన్నీ తిరుగుతున్నాయి టీడీపీ ఉమ్మడి జిల్లా నుంచి ఒక సీటు అడుగుతోంది అది కూడా నర్సంపేట కావాలని పట్టుబడుతోంది. మొదటి నుంచి చంద్రబాబు నాయుడితో సన్నిహితంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి కోసం సీటు అడుగుతున్నారు. కానీ ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు. ఇద్దరి మధ్య సయోద్య కోసం రెండు పార్టీల అధినేతలు పలు చర్చలు జరిపినా ఫలితం లేదు.

ఇద్దరిలో ఒకరు పరకాల, ఇంకొకరు ఇక్కడ నుంచి పోటీ చేయాలని వారికి సూచన చేసినట్లు తెలిసింది. అయితే తనకు నర్సంపేట తప్ప మరొకటి వద్దని ప్రకాష్‌రెడ్డి కరా ఖండీగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్యాగాలకు సిద్ధం కావాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన చేయడంతో ఆందోళనకు గురైన తన సీటును పదిలపరుచుకునేందుకు దొంతి మాధవరెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఢిల్లీ పెద్దల సహకారంతో సీటుకు ఢోకా లేకుండా లాబీయింగ్‌ చేసుకుంటున్నట్లు సమాచారం. అవసరమైతే తాను మళ్లీ ఇండిపెండెంట్‌గానే నర్సంపేట ప్రజలను ఓట్లు అడుగుతాను కానీ నియోజకవర్గాన్ని త్యాగం చేసే ప్రసక్తి లేదని పార్టీ హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.