ఇటీవలే పెళ్లయిన దంపతులపై హత్యాయత్నం జరిగింది. వివరాలు: తాలూకాలోని డబరగానహళ్లిలో డిసెంబర్‌ 13వ తేదీన యువరాజ్‌ (35)కు ఓ యువతితో పెళ్లయింది. వీరు కోళ్లఫారంలో పనిచేసేవారు. డబ్బుకు ఇబ్బందిగా ఉండడంతో దంపతులు శనివారం శిడ్లఘట్టకు వచ్చి డబ్బు తీసుకుని బైక్‌పై బయల్దేరారు. సంతె వీధిలో ఉన్న వాసవి పాఠశాల వెనుక భాగంలో వారిపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేయడంతో యువరాజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు అతన్ని చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ప్రేమ గొడవే దాడికి కారణమని అనుమానంతో దర్యాప్తు చేపట్టారు.