కుటుంబ కలహాలతో ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివాహం జరిగిన నెలరోజులకే ఉరివేసుకుని బలవన్మరనానికి పాల్పడింది. హైదరాబాద్ శంకర్ పల్లికి చెందిన విక్రమ్ కు ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన మానసకు నెలరోజుల క్రితమే వివాహం జరిగింది. కట్నకానుకల కోసం వేధించడంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.