అర్చన తండ్రి , జిల్లా కోర్టులో ప్యూన్‌, కూతురేమో ఇప్పుడు జడ్జి తండ్రి కల నెరవేర్చింది. ఎన్నో కష్టాలు పడింది! అయితే ఆమె జడ్జి కావాలని ఎదురుచూసిన తండ్రి ఇప్పుడు లేడు, చనిపోయిన తండ్రి ఆశయానికి తన విజయం అంకితమని అర్చన చెప్పింది.

ఐదు సంవత్సరాల బిడ్డకు తల్లి అయిన అర్చన తన కలను, తండ్రికి ఇచ్చిన మాటను నిజం చేస్తూ న్యాయమూర్తిగా త్వరలో బాధ్యతలు చేపట్టనుంది. అర్చన తండ్రి గౌరీనందన్‌, సరన్‌ జిల్లా సోన్‌పూర్‌ న్యాయస్థానంలో ప్యూన్‌గా పనిచేసేవారు. శాస్త్రి నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్‌ ఉత్తీర్ణురాలైన అనంతరం, అర్చన పట్నా విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించింది. ఆ తరువాత కొంతకాలం కంప్యూటర్‌ టీచర్‌గా కూడా పనిచేసింది. అర్చన బిహార్‌ జుడీషియల్‌ సర్వీస్‌ పరీక్షలో రెండవ ప్రయత్నంలో విజయం సాధించింది. ఇప్పుడు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతుంది. తన ఆశయం తెలిసి భర్త ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో గొప్పదని చెప్పింది..