తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ముగిసింది. మంగళవారం సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు ఇవాళ ఆరున్నర గంటల పాటు రేవంత్‌రెడ్డిని విచారించారు. ఓటుకునోటు కేసులో రేవంత్‌ను ప్రశ్నించారు ఈడీ అధికారులు 2015లో పెట్టిన కేసుపై ఈడీ అధికారులు విచారించారు..

నాలుగేళ్లు తర్వాత తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేయడం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరైన ఆయన.. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అధికారులు విచారణ హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.. బాధ్యతగల పౌరుడిగా తాను విచారణకి హాజరయ్యానన్నారు. ఎన్నికల సమయంలో నాపై నమోదు అయిన కేసుపై ఈడీ విచారణ చేసిందన్న రేవంత్… అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా.. ఇంకా విచారణ చేయాల్సి ఉంది, రేపు కూడా విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. రేపు కూడా నేను విచారణకి వస్తాను, వారికి సహకరిస్తానని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నమోదైన కేసు పై కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి.. కానీ, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆరోపించారు.