డీన్ చొక్కా పట్టుకొని ఉతికేసింది

తార్నాకాలోని నారాయణ కళాశాల డీన్‌ తనను లైంగికంగా వేదిస్తున్నాడని ఓ మహిళా ఉద్యోగి బంధువులతో సహా ఆందోళనకు దిగింది. బాధితురాలి బంధువులు డీన్‌పై దాడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు డీన్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డీన్‌ శ్రీనివాస్‌ రావు కొద్దిరోజులుగా ఫోన్‌ చేస్తూ తనను వేదిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది.

గత 10 ఏళ్లుగా తాను నారయణ కాలేజీల్లో పనిచేస్తున్నానని, ఇటీవల వచ్చిన డీన్‌ శ్రీనివాస్‌ కాలేజీ అయిపోయిన తర్వాత కూడా ఫోన్‌ చేస్తూ అసభ్యకర మాటలతో టార్చర్‌ పెడుతున్నాడని పేర్కొంది. అతన్ని వెంటనే సస్పెండ్‌ చేయాలని యాజమాన్యాన్ని కోరింది. ఈ విషయం యజమాన్యానికి తెలియజేయడం కోసమే తాను ఆందోళన చేపట్టినట్లు స్పష్టం చేసింది.