పీజీఆర్‌ థియేటర్‌లో నారా, నందమూరి కుటుంబాలు సందడి చేశాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూరు నారావారిపల్లెకు విచ్చేసిన నారా లోకేశ్‌, బ్రాహ్మణిలతో పాటు నందమూరి రామకృష్ణ, గారపాటి లోకేశ్వరి ఇతర కుటుంబ సభ్యులంతా ప్రేక్షకులతో కలిసి ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా పీజీఆర్‌ థియేటర్‌ యాజమాన్యం వారికి ఘన స్వాగతం పలికింది. యుగపురుషుడు ఎన్టీఆర్‌ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా కథానాయకుడు చిత్రం ఉందని, ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకుల మధ్యలో మరోసారి సినిమా వీక్షించాలనే తమ కుటుంబ సభ్యులంతా విచ్చేసినట్లు ఎన్టీఆర్‌ కుమార్తె లోకేశ్వరి తెలిపారు.