వరంగల్‌ జిల్లాలో ప్రేమోన్మాది పెట్రోల్‌ దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవళి మృతి చెందింది. రవళి మృతదేహానికి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో రవళి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం రవళి మృతదేహాన్ని వరంగల్‌ జిల్లా స్వస్థలానికి తరలించారు. గత కొన్ని రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడి నిన్న రవళి మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రవళి మృతి వార్త విన్న ఆమె తల్లి కుప్పకూలిపోయింది. ప్రేమోన్మాదిని ఉరిశిక్ష విధించాలని రవళి తండ్రి డిమాండ్‌ చేస్తున్నాడు….