‘నా చావుకు కారణం ప్రేమ’
BBనగర్ శివారు చిన్నేటివాగు సమీపంలోని రైల్వే వంతెన కింద గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది.
Advertisement
శనివారం భువనగిరి రైల్వే SI అచ్యుతం వివరాల ప్రకారం. సికింద్రాబాద్ – కాజీపేట రైల్వే మార్గంలోని కిలో మీటర్ నెంబర్ 228/34-38 మైలురాయి వద్ద రైల్వే వంతెన కింద గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని చూసిన ట్రాక్‌మెన్ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుర్తుతెలియని సుమారు 25 సంవత్సరాల వయస్సు గల యువతి ప్రేమలో విఫలమై రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని తెలిపారు.
తన ఎడమ చేతిపై ‘నా చావుకు కారణం ప్రేమ’ అని రాసి ఉందని దాని ఆధారంగా ఆత్మహత్యగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.