{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578248847396","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578248822721","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

ఘట్టమనేని అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్‌తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, గౌతమ్‌ల ఫొటోను పోస్ట్ చేసిన నమ్రత.

ఈ ముగ్గురు తన సూపర్ హీరోలని, వీరితో తన జీవితం సంపూర్ణమైందని తెలిపారు. ఈ ముగ్గురూ తనపై చూపిస్తున్న లవ్, ఎపెక్షన్‌కు ధన్యురాలని అయిపోతున్నానని తెలుపుతూ.. ఎప్పుడూ ఈ ముగ్గురు తనకు ఓ కొత్త విషయాన్ని నేర్పిస్తున్నారని, దీనికి ఎంతో సంతోషంగా ఉన్నానని, వీళ్లే తన బలమని ఆమె ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ ఫొటోలో మూడు జనరేషన్‌లు ఒకే ఫార్మెట్‌ను ఫాలో అవుతున్నాయని తెలిపేలా కృష్ణ, మహేష్, గౌతమ్ టక్ చేసుకుని, టై కట్టుకుని వైట్ కలర్ షర్ట్‌తో దర్శనమిస్తున్నారు. నమ్రత పోస్ట్ చేసిన ఈ ఫొటో, ఆమె వ్యక్తపరిచిన భావం.. ఘట్టమనేని అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఇదే విషయం తెలుపుతూ అభిమానులు ఆమె ట్వీట్‌కు రీ ట్వీట్‌లు చేస్తున్నారు.