నా పెళ్లికి రండి!! కేసీఆర్‌కు చందనా దీప్తీ IPS ఆహ్వానం…

Advertisement

డ్యూటీలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ క్రియాశీలంగా ఉంటూ యువతకు ఎంతో స్పూర్తిగా నిలుస్తూ క్రేజ్ తెచ్చుకున్న పోలీసు అధికారి మెదక్ ఎస్పీ చందనా దీప్తీ. తన పనితీరుతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చారు. తనకు పెళ్లి సంబంధం కుదరడంతో పెళ్లికి ఆహ్వానించేందుకు ఆమె సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు. స్వయంగా ప్రగతి భవన్ వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఇటీవలే ఆమెకు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి సమీప బంధువుతో నిశ్చయమైంది. అక్టోబర్‌లో చందన దీప్తి వివాహం జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. దానికి తగ్గట్టుగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని దీప్తి ఇది వరకు చెప్పి ఆసక్తి రేకెత్తించారు..

అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరవుతారని తెలుస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ IPS అధికారిణి చందన దీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైన కనిపించనున్నారన్న మాట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here