తెలంగాణ ఐపీఎస్ అధికారిని మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మో హన్ రెడ్డిని కలిశారు . ఇందులో ఒక విశేషం ఉంది . కాబోయే భర్తతో కలిసి ఏపీ ముఖ్యమంత్రిని కలిసి తమ పెళ్ళికి రావాలని ఆహ్వానించారు . మెదక్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న చందన దీప్తికి కాబోయే వరుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బంధువు కావటంతో తెలంగాణ ఐపీఎస్ అధికారిణికి , ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి అలా బంధుత్వం కుదిరింది . మొత్తానికి హైదరాబాద్ లో జరగబోయే ఈ పెళ్ళికి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హాజరుకావడం ఖాయం .

Advertisement

ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ పెళ్ళికి హాజరు అవుతుండటంతో మరోమారు ఇద్దరు సీయంలు కల్యాణ వేదికపై కలవనున్నారని సమాచారం . డ్యూటీలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ క్రియాశీలంగా ఉంటూ యువతకు ఎంతో స్పూర్తిగా నిలుస్తూ క్రేజ్ తెచ్చుకున్న పోలీసు అధికారి మెదక్ ఎస్పీ చందనా దీప్తీ. తన పనితీరుతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చారు.

తనకు పెళ్లి సంబంధం కుదరడంతో పెళ్లికి ఆహ్వానించేందుకు ఆమె సీఎం కేసీఆర్ ఇంటికి, మరియు AP ముఖ్యమంత్రి వైయస్ జగన్మో హన్ రెడ్డిని వెళ్లారు. స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు..