కాళ్ళ పారాణి ఆరని ఓ అబల చివరిమాటలు

అత్త, మామ, మరిది చేతిలో తీవ్రంగా గాయపడిన మౌనిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో తన చావుకు కారణాలు వివరించింది.. 
అత్తింటి ఆరళ్ళకు ఓ అబల బలైంది. అత్తమామలు, మరిది కలిసి ముక్కుపచ్చలారని కోడలిని నిప్పంటించి కడతేర్చారు.కోటి ఆశలతో మెట్టినింటికి చేరి మూడునెలలు తిరగకముందే తనువు చాలించింది.పూర్తిగా కాలిన శరీరంతో నాలుగురోజులుగా మృత్యువుతో పోరాడి విగతజీవిగా మారింది.. హృదయవిదారకమైన ఈ ఘటన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని కొరిడీ గ్రామంలో జరిగింది. అత్తమామలు, మరిది, ప్రసన్న కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పింది. భర్త చేతకానివాడని , తనపై హింసలను చూస్తూ ఉంటాడని కూడా చెప్పింది. ఈ మాటే ఆమె చివరిమాట. ఆ తరువాత తుదిశ్వాస విడిచింది. ఈ నేపధ్యంలో గత 15 క్రితం అత్త, మామ, మరిది కలిసి. భర్త రవికుమార్ఇంట్లో లేనిసమయంలో మౌనికకు నిప్పంటించారు.

తీవ్రంగా గాయపడ్డ మౌనికను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మూడువంతులు శరీరం కాలిపోవడంతో 15 రోజులు మృత్యువు తో పోరాడిన మౌనిక గతరాత్రి తనువు చాలించింది