దేశం నుంచి ఆకలిని పార దోలడానికి అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తోన్న కృషి అభినంద నీయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు . సోమవారం బృందావన్లో పర్యటించిన ఆయన ఎనీవో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేద విద్యార్దులకు భోజనం వడించారు . ‘ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మూడో బిలియన్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగమైన వారందరికి అభినందనలు . ఆకలిని పారదోలడానికి వారి కృషి అమోఘం ‘ అని ప్రధాని ట్వీట్ చేశారు బృందావన్ చంద్రోదయ మందిర్ క్యాంపస్లో ఫౌండేషన్ నిర్వహిస్తోన్న కార్యక్రమానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మోదీ ఆవిష్కరించారు .
విద్యార్థులకు భోజనం తినిపించిన మోడీ . .
మీకు 12 గంటలకు భోజనం అందాలి . కానీ , ప్రధాని లేటుగా రావడం వల్ల ఆలస్యం అయింది కదా ? అంటూ ఓ చిన్నారితో మోడీ సరదాగా చిట్ చాట్ చేశారు . వెంటనే ఆ పక్క ఆయనే ఉన్న మరో విద్యార్ధిని సమయ స్పూర్తితో సమాధానం ఇచ్చి ఆకట్టుకుంది . ఇక్కడికి వచ్చే ముందు మేమంతా తినేవచ్చాం అన్న సమాధానానికి మోడీ మురిసిపోయారు . ఈ సన్నివేశానికి చెందిన వీడియోను ప్రధాని ట్వీట్ చేశారు ఆసక్తికర సంభాషణకు కొద్దినిముషాల వ్యవధిలో 6 లక్షల వ్యూస్ , 2 , 500 కామెంట్లు వచ్చాయి . మోడీ పడీ . . మీరు గ్రేట్ . . ఆ విద్యార్థులు చాలా తెలివైనవాళ్లు అంటూ రీట్వీట్లువచ్చాయి తర్వాత విద్యార్ధులకు తానే స్వయంగా భోజనం వడ్డించిన , తినిపించిన వీడియోలను మోడి ట్వీట్ చేశారు …