పాలకుర్తి మండలంలోని గూడూరులో మృతురాలి బంధువులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిందితుడి ఇంటి ఎదుట గొయ్యి తీసి ఘట్‌కేసర్‌లోని ఘటనా స్థలం నుంచి తీసుకొచ్చిన చితాభస్మాన్ని ఖననం చేశారు.

దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులకు మద్దతుగా దళిత సంఘాలు, సుమారు 500 మంది రాస్తారోకో చేపట్టారు. నిందితుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. కుల వివక్షతోనే కర్కశంగా కాల్చి చంపారని, నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు.