{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581437762134","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581437732567","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

నిద్రిస్తున్న యువకులపై ఆయుధాలతో దాడి ఒకరి మృతి , మరొకరి పరిస్తితి విషమం పటాన్‌చెరు శివారులో కలకలం నిద్రిస్తున్న ఇద్దరి యువకులపై దుండగులు ఆయుధాలతో అతి దారుణంగా దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన పటాన్‌చెరు శివారులో కలకలం రేపింది.

Advertisement

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్త లింగాయపల్లికి చెందిన అశోక్ , హైదరాబాద్ బోరబండకు చెందిన హాజీ ( 35 ) పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులో జాతీయ రహదారిపై లారీ చోదకులకు చిరునామా చెప్పేవారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసేవారు. రాత్రివేళ విరామం కోసం పక్కనే ఉండే ఓ టీకొట్టులో నిద్రించేవారు. గురువారం రాత్రి సైతం అందులో నిద్రించగా. తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో హాజీ అక్కడికక్కడే మృతి చెందగా అశోక్ గాయపడ్డాడు . సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అశోకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

స్థానికంగా ఉన్న గైడ్ (వాహనాలకు దారి చూపేవారు) ల మధ్య వివాదం ఈ ఘటనకు దారి తీసిందా లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయుధం కోసం వెతికారు. క్లూస్ టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించింది. పోలీసు జాగిలం హత్య జరిగిన ప్రదేశంలో తిరుగుతూ చివరిగా సమీపంలోని గణేష్ దేవాలయం వద్దకు వెళ్లి ఆగింది. గురువారం ఉదయం పటాన్ చెరు ఇన్ ఛార్జి డీఎస్పీ గణపతి జాదవ్ , సీఐ నరేష్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శవ పరీక్ష కోసం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదనపు ఎస్పీ సృజన హత్య జరిగిన స్థలాన్ని సందర్శించారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. మెదక్ ఎస్పీ చందనాదీప్తి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు .