నిన్న ఈటల ! ఇప్పుడు రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు..

Advertisement

మంత్రి ఈటల రాజేందర్ హుజారాబాద్ లో ఇటీవల చేసిన కామెంట్స్ పై స్పందించారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన టీచర్స్ డే వేడుకల్లో పాల్గొని మాట్లాడారు రసమయి బాలకిషన్. మంత్రి ఈటల రాజేందర్ కు, తనకు నిజాలు మాట్లాడటమే వచ్చు అని రసమయి బాలకిషన్ అన్నారు. తాము ఇద్దరం కడుపులో ఏమీ దాచుకోమని చెప్పారు. ఈటల, తాను ఉద్యమంలో కొట్లాడినోళ్లమని చెప్పారు. తమ నోటికి అబద్దాలు రావని అన్నారు. తాను చదువు చెప్పిన స్కూలుకు ఇటీవల వెళ్తే.. అప్పుడెలా ఉందో.. ఇప్పుడెలా ఉందో తేడా చెబుతూ ఈ కామెంట్స్ చేశారు రసమయి బాలకిషన్.

మంత్రి పదవి ఎవరి భిక్ష కాదంటూ.. మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో ఆవేశంగా మాట్లాడటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మంత్రి ఈటలను తప్పిస్తారంటూ వస్తున్న వార్తల మధ్య ఈటల చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి. ఆ మరునాడే మంత్రి ఈటలను హైదరాబాద్ షాద్ నగర్ లోని ఆయన ఇంట్లో రసమయి బాలకిషన్ , ఇతర అనుచరులు కలిసి సంఘీభావం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here