నిబంధనలు పాటించాలి

ముందస్తు ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎన్నికల ఖర్చు, ఇతర అంశాలపై అవగాహన కల్పించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అందరూ కోడ్ ను పాటించాలని సూచించారు. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

అభ్యర్థుల వ్యయ పరిమితి రూ. 28 లక్షలని వివరించారు.