నిరంతర నిఘాకు పోలీస్‌ వాహనాల వినియోగం : కుమారి చందన దీప్తి IPS

జిల్లా పోలీసు ఉన్నత అధికారి ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ నందు జిల్లా పోలీస్ స్టేషన్ లకు నూతన “ఇనోవా క్రిస్ట ” మరియు బొలెరో వాహనాలు ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతలు పరిరక్షణతో పాటు ప్రజలకు నిరంతరం భద్రత కల్పించడం కోసం నూతనంగా పోలీస్‌ వాహనాలను వినియోగించడం జరుగుతుందని ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు తెలిపారు. మెదక్ జిల్లా పోలీస్‌ విభాగానికి నూతనంగా అందజేసిన 32వాహనాలను ఈ రోజు ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, జెండా ఊపి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమం లో జిల్లా ఎస్‌పి గారు మాట్లాడుతూ,

విజిబుల్‌ పోలీసింగ్‌, డయల్‌ 100 ఫిర్యాదులు, ముందస్తు సమాచారం సేకరణ, బందోబస్తులు, లా అండ్‌ ఆర్డర్‌ విధులు, కమ్యూనిటీ పోలీసింగ్‌లకు ఈ పెట్రోలింగ్ కోసం ఇట్టి వాహానాలను వినియోగించాల్సి వుంటుందన్నారు. ఇట్టి వాహనాలను పోలీస్ స్టేషన్ ల నందు 100 డైల్, అత్యవసర సందర్భాలలో మరియు పెట్రోలింగ్ కు ఉపయోగించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్‌పి గారు తెలిపినారు. 100 డైల్, అత్యవసర సందర్భాలలో వీటిని ఉపయోగించి సరియైన సమయం లో సంఘటన ప్రదేశాలకు చేరుకోవాలని, ముఖ్యంగా నేరగాళ్ళ పని పట్టడానికి, మరియు ఏదైనా సంఘటన జరిగినప్పుడు అత్యంత తక్కువ సమయంలో సంఘటన స్థలానికి చేరుకోవాడానికి ఈ వాహానాలను వినియోగించాలని సిబ్బందికి సూచించారు.

సిబ్బందికి ఈ వాహనాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇట్టి వాహనాలను జాగ్రతగా నడుపుకోవాలని, మొత్తం 32 వాహనాలు ఇవ్వడం జరుగిందని అని, ఇట్టి పెట్రోలింగ్ వెహికిల్ లో విధులు నిర్వహించే సిబ్బందికి ఇంతకుముందే ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని అని , పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని, మెదక్ జిల్లా ను శాంతి యుత జిల్లా గా మార్చుటలో సిబ్బంది అధికారులు పాలుపంచుకోవాలని, మెదక్ జిల్లా పోలీసులు జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలని, ఇట్టి వాహనాలను తమ జిల్లాకు అందించిన ఉన్నత అధికారులకు మెదక్ జిల్లా పోలీస్ తరుపున దన్యవాదాలు తెలిపినారు.

ఇట్టి కార్యక్రమం లో ఎ.ఆర్ డి.ఎస్.పి శ్రీ.మురళిగారు, ఆర్.ఐ. సురపనాయుడు గారు, మెదక్ జిల్లా లోని ఎస్.ఐ.లు, ఆర్.ఎస్.లు మరియు సిబ్బంది తరితరులు పాల్గొన్నారు.