{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582174365110","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582174352204","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

నిర్భయ దోషుల్లో ఒక్కడైనా వినయ్ శర్మ తీహార్ జైల్లో గురువారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీహార్ జైల్లో దోషులు ఉంటున్న జైలు గదిలో గోడకు తల బాదుకొని గాయపర్చుకున్నాడు. దీంతో వినయ్ తలకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన జైలు అధికారులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే నిర్భయదోషులకు పటియాల హౌస్ కోర్టు డెత్ వారెంట్ కూడా జారీ చేసింది. మార్చి 3 తేదీన ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులకు ఉరి తీయాలని ఉరి తీయాలని తిహార్‌ జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. నిర్భయదోషుల ఉరిశిక్ష అమలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది.

నిర్భయ దోషులకు సోమవారం నాడే కొత్త డెత్ వారెంట్లు జారీ:

నిర్భయ కేసులో దోషులకు శిక్ష అమలు అంశం రోజుకో టర్న్ తీసుకుంటోంది. నలుగురు దోషులకు సోమవారం కొత్త డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇప్పటికే రెండు సార్లు ఉరి నుంచి తప్పించుకున్న దోషులకు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు దోషులు ముకేశ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌లకు పాటియాల హౌస్‌ కోర్టు డెత్ వారెంట్లను జారీ చేసింది. దీంతో నలుగురు దోషులను ఒకే సారి మార్చి 3న ఉదయం 6 గంటలక ఉరితీయనున్నారు. నిందితులకు రెండు సార్లు డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ దోషులకు న్యాయపరమైన అవకాశాలు పెండింగ్‌లో ఉన్నందున వాటిపై కోర్టు స్టే విధించింది. ఉరిశిక్షపై స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పాటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ ను సోమవారం జారీ చేసింది. తాజాగా కోర్టు డెత్ వారంట్ జారీ చేయడం పట్ల నిర్భయ తల్లి ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, నిర్భయ దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు జనవరి 22ను ఉరితీయాలంటూ జనవరి 7న పాటియాలా హౌస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం, దోషులు అప్పీలు చేయడంతో ఉరి వాయిదాపడింది. ఫిబ్రవరి 1న ఉరి తీయాలని ఆదేశిస్తూ ట్రయల్ కోర్టు జనవరి 17న రెండోసారి డెత్ వారంట్ జారీ చేసింది. దీనిపై దోషుల తరపు న్యాయవాది వాదనలను వినిపిస్తూ ఒకరి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉందని, నిబంధనల మేరకు మిగిలిన ముగ్గుర్ని ఉరి తీయడం సాధ్యం కాదన్నారు…