కడుపులో ఉన్న శిశువు మృతి

తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిర్మల్ లోని మహాలక్ష్మీవాడలో ఓ యువకుడు ఒక యువతి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమను అమ్మాయి తరపున వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు తన ప్రియురాలితో కలిసి పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి తరపున బంధువులు ప్రియుడి ఇంటిపై దాడికెళ్లారు.

దాడికెళ్లిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోగా నిండు గర్భిణీ అయిన ఆ యువకుడి అక్క ఉండటాన్ని గమనించారు. వాళ్ళు ఏమి ఆలోచించకుండా ఆ యువకుడి అక్కను కడుపులో తన్నారు. దీంతో కడుపులో ఉన్న శిశువు మృతి చెందారు. ఆ కారణంగా దాడి చేసిన ఆ యువతి బంధువులపై బాధితులు పోలీసు కేసు పెట్టారు. దీంతో పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..