అందంతో కుర్రకారును, నటనతో ప్రేక్షకుల మనసును దోచేశారు ‘RX 100’ ఫేమ్‌ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే భారీ క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ భామ సోషల్‌ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటారు. 

నెటిజన్లు సరదాగా అడిగిన కొన్ని ప్రశ్నలకు పాయల్‌ బదులిచ్చి తన ఇన్‌స్టామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశారు. మీ బికినీ ఫోటో ఉంటే పోస్ట్‌ చేయండి అంటూ ఓ నెటిజన్‌ అడిగి ప్రశ్నకు.. ఇప్పుడు కాదు. కొంత బరవు తగ్గడానికి వర్కవుట్స్‌ చేస్తున్నాను. శరీరం మంచి ఆకృతికి వచ్చిన తర్వాత బికినీ ఫోటోలు పోస్ట్‌ చేసి ని కోరిక తీరుస్తాలే అంటూ బదులిచ్చారు. నెటిజన్లు అడిగిన మరిన్ని ప్రశ్నలు అన్నిట్టికి పాయల్‌ సమాధానం ఇచ్చారు…