నీ కూతురు కూడా కావాలి

సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ కామంతో పరాయి మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడమే కాక ఆమె కూమార్తెపైన కూడా కన్నేశాడు. ఈ ఘటన వేలూరులో జరిగింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ పోలీసు. తన కుమార్తెను వివాహం చేసుకుంటానని బలవంతం పెట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వాలాజా సమీపంలోని మేల్‌పుదుపేటకు చెందిన మహిళ (36) భర్తతో విభేధాలతో తన ఇద్దరు కుమార్తెలతో కలసి వేరుగా జీవిస్తుంది. ఆమెకు పనిచేస్తున్న కావేరిపాక్కంకు చెందిన పోలీసుతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కాగా అతను ఆమె పెద్ద కుమార్తెను ఇష్టపడి తనకిచ్చి వివాహం చేయాలని ఒత్తిడి చేశాడు. ధిగ్ర్భాంతి చెందిన ఆమె అతడిని ఇంటికి రావద్దని తెలిపినా వచ్చి వేధిస్తునే ఉన్నాడు.

దానిని తట్టుకోలేని ఆమె బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వాలాజా పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.