నెలాఖరులో వరంగల్ పట్టణంలో పర్యటించనున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ తమ అధినేతలను రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీలను జిల్లా ప్రచారానికి తీసుకురావాలని భావిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతో రోడ్ షోలు నిర్వహించేలా అధిష్టానాన్ని ఒప్పించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఒక వైపు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కనీసం రెండు, మూడు నియోజకవర్గాలోనైనా కాంగ్రెస్ అధినేతల ప్రచారం ఉండేలా జిల్లా నాయకత్వం సమాలోచనలు చేస్తున్నది. భారీ బహిరంగ సభలు లేకున్నా కనీసం నగర ప్రాంతంలోనైనా అధినేత రాహుల్‌గాంధీ రోడ్ షోలు ఏర్పాటు చేసేందుకు వ్యూహరచనకు సిద్ధమయ్యారు.
మొత్తంగా ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో హోరెత్తబోతున్నది. అధినేతల రాక, ముమ్మరమైన ఎన్నికల ప్రచారానికి సంకేతంగా నిలుస్తున్నది.