మండలం జాకారం గ్రామ శివారులో గల గట్టమ్మ దేవాలయం వద్ద మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేయబడిన (5) హుండీలను ములుగు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం రోజున హుండీలలో గల కానుకల లెక్కింపు చేపట్టనున్నట్లు ములుగు మండల తహసీల్దార్ నారాయణ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు, జాకారం గ్రామపంచాయతీ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరు కావాలని ‌కోరారు.