ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహా జాతరను పురస్కరించుకుని జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు నలుగురు మంత్రులు శనివారం మేడారం రానున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మేడారంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హన్మకొండ నుంచి బస్సులో మేడారం బయలుదేరుతారు. అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన బస్‌ క్యాంపును ప్రారంభిస్తారు. అనంతరం జాతర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.