నేడు వరంగల్ కు భారత ఉపరాష్ట్రపతి రాక

వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాలయం(నిట్) ఏర్పడి 60వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా సోమవారం వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడాది పాటు జరిగే వేడుకలను ప్రారంభించేందుకు భారత ఉపరాష్ట్రపతి M.వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం9.30 గంటలకు వెంకయ్యనాయుడు నిట్‌కు చేరుకుని అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌లో డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభిస్తారని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు.