నేడు సినీ హాస్యనటుడు బ్రహ్మానందం రాక

ఈరోజు హనుమకొండ ప్రముఖ సినీ హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం రానున్నారు. 

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నేరెళ్ళ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టు ఆధ్వర్యంలో కల్చరల్ ట్రస్టు అధ్యక్షుడు నేరెళ్ల శోభా వేణుమాధవ్ మార్గదర్శకత్వంలో పద్మశ్రీ వేణుమాధవ్ 87 వ జయంతి వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో సభ అధ్యక్షుడిగా రాష్ట్ర భాష సంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హాస్య నటుడు బ్రహ్మానందం తదితరులు హాజరుకానున్నారు