సెంట్రల్‌ జైలు ఆవరణలోని చెరువులో పెంచిన చేపలను ఆదివారం అమ్మకాలు జరుపనున్నట్టు జైలు పర్యవేక్షణాధికారి ఎన్‌. మురళీబాబు తెలిపారు. సంవత్సర కాలంగా జైలు ఆవరణలో ఉన్న రెండు ఎకరాల చెరువులో పెంచిన చేపలను ఉదయం 7గంటల నుంచి విక్రయిస్తామని ఆయన తెలిపారు. చేపల కోసం వచ్చే వారిని బట్టి చెరువులో నుంచి పట్టి తెస్తామని పేర్కొన్నారు. కేవలం అప్పుడే పట్టిన చేపల విక్రయాలు మాత్రమే జరుగుతాయన్నారు. క్యూ పద్ధతిలో, తక్కువ ధరకు చేపల అమ్మకాలు నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా బంగారు తీగ, రవ్వులు, బొచ్చెలు, గ్యాస్‌కట్‌లు విక్రయిస్తామని తెలిపారు. ఒక వ్యక్తికి ఒక కిలో చేపలు మాత్రమే విక్రయిస్తామన్నారు. ఈ అవకాశాన్ని వరంగల్‌ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.