రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లి గ్రామానికి చెందిన మామిడాల శంకర్ లక్ష్మీల కుమారుడు సాంబ రాజు పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.

ఆట వస్తువు అనుకొని వాడకంలో లేని సెల్‌పోన్ బ్యాటరి తనవెంట స్కూలుకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బ్యాగు నుండి నోట్ బుక్ తీస్తుండగా ప్రమాదవశాత్తు బ్యాటరీ పేలి విద్యార్ధికి నోటి, చేతి, చాతి భాగంలో తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాలుడికి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం విద్యార్ధి తల్లి తండ్రులను పిలిపించి ఆసుపత్రికి తరలించారు.

ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పిల్లల చేతికి ఇచ్చి నిర్లక్ష్యం చేయవద్దని గ్రామ ప్రజలు, పిల్లల తల్లిదండ్రులను ఉపాధ్యాయులు కోరుతున్నారు…