ముఖ్య మంత్రి కేసీఆర్ గారి 65 వ జన్మదిన వేడుకలు . తెరాస న్యూజిలాండ్ శాఖ ఆధ్వర్యంలో ఆక్లాండ్ సూపర్ సిటీ లోని ఎప్సం మరియు మనుకవ్ సిటీ లోని న్యూజిలాండ్ బ్లడ్ శాఖలలో నిర్వహించడం జరిగింది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు నిరాడంబరంగా సందేశాత్మకంగా “రక్త దానం – ప్రాణ దానం ” సామజిక కార్యక్రమం నిర్వహించినట్టు తెరాస న్యూజిలాండ్ శాఖ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన తెలిపారు . కేసీఆర్ గారికి 65 వ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం తో పాటు , ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకు రావడానికి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దీవెనలు , ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు .

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన, ఉమెన్స్ అఫైర్స్ చైర్పర్సన్ సునీత విజయ్ ,, మెంబర్షిప్ ఇంచార్జి కిరణ్కుమార్ పోకల, కిరణ్ రెడ్డి ,అరుణ్ రెడ్డి గొనె , హారిక రెడ్డి తదితరులు రక్త దానం చేసారు . ఈ కార్యక్రమంలో తెరాస న్యూ జీలాండ్ శాఖ జనరల్ సెక్రటరీ నర్సింగ రావు ఇనగంటి , ఉపాధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఓడనాలా మరియు ఇతర సభ్యులు , కెసిఆర్ గారి అభిమానులు పాల్గొన్నారు .

కాశ్మీర్ లో CRPF జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు తమ శాఖ తరపున సంతాపం ప్రకటిస్తున్నట్టు విజయభాస్కర్ రెడ్డి కొసన తెలిపారు .ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన NZ బ్లడ్ శాఖలకు చెందిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు