నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమంలో బాలీవుడ్ న‌టి ఆదాశ‌ర్మ పాల్గొంది. అందరిలాగా ఏదో ఒక డ్రెస్ వేసుకుంటే నన్నెవరు చూస్తారని అనుకుందో ఏమోగానీ న్యూస్ పేపర్ డ్రెస్ లో ప్రత్యక్షమైంది. మరీ టవల్ లా చుట్టుకోకుండా న్యూస్ పేపర్లతో ఒక డిజైనర్ డ్రెస్ లాంటిది వేసుకుంది. మరి దానికి సపోర్ట్ గా వెనక క్లాత్ ఉందో లేదో తెలియదు. ఎంత పేపర్ డ్రెస్ అయినా క్లీవేజ్ షో చేయడం మాత్రం అసలు మర్చిపోలేదు.
ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి “నేను న్యూస్ లో ఉన్నాను. ఎవరైనా న్యూస్ పేపర్ డ్రెస్ వేసుకున్న వారిని ట్యాగ్ చేయండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దాంతో నెటిజనులు తమదైన శైలిలో కామెంట్లతో రెచ్చిపోయారు. ఒకరు ‘అహనా పెళ్ళంట’ లో పరమ పిసినారి కోట శ్రీనివాస రావు పేపర్లు ఒంటికి చుట్టుకుంటాడు కదా.. ఆ ఫోటో పోస్ట్ చేసి జంధ్యాలగారు ఎప్పుడో ఈ పేపర్ డ్రెస్ లో హాయి ఉందని చెప్పారన్నారు. మరొకరు నీ” న్యూస్ పేపర్ వయ్యారం సరే. నీళ్ళు పడతాయేమో చూస్కో” అన్నారు. ఏదైతేనేం అదా న్యూస్ పేపర్ల డ్రెస్ వేసుకొని న్యూస్ క్రియేట్ చేసింది…