పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష తేదీలో మార్పు

పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష తేదీలో మార్పు

హైదరాబాద్‌: తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఈనెల 28 జరగాల్సిన రాతపరీక్షను అక్టోబరు 4న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జూనియర్‌ పంచాయితీ కార్యదర్శుల నియామకం కోసం దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించారు.

నేటితో ముగియాల్సిన దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 14 వరకు పొడిగించారు. రేపటితో ముగియాల్సిన దరఖాస్తు గడువును ఈ నెల 15వరకు పొడిగించారు. దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో గడువును పొడిగిస్తూ నియామక ప్రక్రియ కమిటి కన్వీనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here