ఇవాళ్టీతో మూడో విడత ప్రచారానికి తెరపడనుంది.

సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఎల్లుండి అఖరి విడత పోలింగ్ జరగనుంది. మూడో విడత షెడ్యూల్లో భాగంగా 4 వేల 116 గ్రామ సర్పంచ్ లు, 36 వేల 729 వార్డు సభ్యుల పదవులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇందులో 573 సర్పంచ్ పదవులు, 8, 956 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి.

పలు కారణాలతో 10 చోట్ల సర్పంచ్ పదవులకు, 185 చోట్ల వార్డు సభ్యుల పదవులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో మిగిలిన స్థానాలకు ఈ నెల 30న ఎన్నికలు నిర్వహిస్తారు.  బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి లెక్కింపు మొదలుపడతారు.

ఇవాళ సాయంత్రం ప్రచారం ముగుస్తుండటంతో

స్పీడ్ పెంచారు సర్పంచ్ అభ్యర్థులు. మరోవైపు పార్టీల తరుపున బడా నేతలు కూడా మద్దతుదారులకు అనుకూలంగా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా వానలోనూ గ్రామాల్లో పర్యటించారు.