పండుగవేళ జోరుగా మద్యం అమ్మకాలు

దసరా పండుగ వేళ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. వరంగల్ అర్బన్, హన్మకొండ, కాజీపేట, ఖిలావరంగల్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక్క రోజే రూ. 12.94 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ అధికారుల అంచనా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం ఇదే విధంగా మద్యం అమ్మకాలు జరిపినట్టు డీసీ కార్యాలయం సిబ్బంది వెల్లడించారు.

పండుగ దావత్ పుణ్యమా అని, బెల్ట్ షాపుల యజమానులు కూడా చేతినిండా సంపాదించారు.