నవీన సమాజంలో పలు రకాల ప్రలోభాలకు గురిచేస్తూ అతివలు వశపటిర్చుకునే దిశలో కొందరు ప్రయత్నించడం దీంతో వారి ప్రయత్నాలను తిప్పికొట్టే దిశలో ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అవలంబిస్తున్నప్పటికి ఇలాంటి వ్యవహారాలు , ఆర్ధిక పరమైన వ్యవహారాలతో కొందరు వ్యవహరిస్తున్న తీరును, వాటిని ఆసరా చేసుకునే యువతీ యువకులు ఇలాంటి అగాయిత్యానికి పాల్పడుతున్న దాఖలాలు న్యాయస్థానాలలో పోలీస్ స్టేషన్లలో వెలువలుగులోకి వస్తున్నాయి. గతంలో హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో వ్యభిచార గృహాలపై ప్రభుత్వ టాస్కపోర్సు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం జరిగింది.. ప్రస్తుతం జనగామలో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొందరు వ్యవభిచారం నిర్వహించేందుకు ప్రయత్నించడం జరుగుతుంది . కాని ఇదేతరుణంలో జనగామ జిల్లా కేంద్రం ఏర్పడినప్పపటినుండి జనగామలో రద్దీగా ఉండడం , ప్రజలు పలు అవసరాలను జిల్లా కేంద్రంలో పరిష్కరించుకునేందుకు అవసరాల రీత్యా వచ్చే వారు , దీంతో పాటు విద్యార్థులు తమ పైచదువుల కోసం జనగామలో అద్దె భవనాల్లో ఉండడం జరుగుతుంది . కానీ కొందరు మాత్రం ఇలాంటి వ్యవహారాలను అదనుగా చూసుకొని వ్యభిచారానికి పట్టణ శివారు ప్రాంతాలు ఎంచుకోవడం జరిగింది..

అతివలు ఇలాంటి నిర్వహించాలంటే ఎవరికి తెలియని విధoగా గుట్టుచప్పుడు కాకుండా పట్టణానికి దూరంగానే వ్యవహరించే తీరుగా కొందరు నిర్వాహకులు యువతను ఆసరా చేసుకొని వ్యభిచారానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వం రక్షణ పరమైన చర్యలు తీసుకునేందుకు పట్టణంలోని పలు ప్రాంతాలలో సీసీ కెమెరాలు పోలీసు శాఖలో షీంటీలను పెట్రోలింగ్ , గస్తీలు నిర్వహించినప్పటికి గుట్టుచప్పుడు కాకుండానే ఈవ్యవహారం సాగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు . ఇటీవలనే జనగామ బస్టాండ్ ఏరియాలలో ఈ తతంగానికి శ్రీకారం చుట్టేందుకు మధ్యవర్తులు ఒప్పందాలు కుదుర్చుకొని వారిని తీసుకువెళ్లి వ్యభిచారానికి పాల్పడు తున్నట్లు సమాచారం .

దీంతో జనగామ రద్దీగా ఆర్టీసీ చౌరస్తా బస్టాండ్ ఏరియాలో నిఘా కెమెరాలను విధించడం , పెట్రోలింగ్ నిర్వహించడం , బస్టాండ్ లో పెట్రోలింగ్ వాహనంతో పాటు షీటీంలను ఉంచినప్పటికిని యదేచ్చగా వాహనాలు నిలిపి సాయంత్రం 6 నుండి 8 గంటల ప్రాంతంలోనే కారులలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పలువురు పుకార్లు , షికార్లుగా వినిపిస్తున్నాయి . జనగామ నడిబొడ్డులోనే ఇంత నిఘా నేత్రాల మధ్య షీటీంలు అనేక పెట్రోలింగ్ లు ఉన్నా రద్దీ ప్రాంతంలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు ఇప్పటికైనా జనగామ పరిసర ప్రాంతాలలో నిఘాపెంచాలని , దీనికితోడు బస్టాండ్ ఏరియాలో కూడా ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం షీటీంలు యువత చెడుమార్గం పట్టకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు …